జైపూర్: భారత్, పాకిస్థాన్ మధ్య దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చాలా పేలుడు వస్తువులు కనిపిస్తున్నాయి. దీంతో ఆర్మీ దళాలు వీటిని సురక్షితంగా ధ్వంసం చేస్తున్నాయి. (Projectile safely defused) ఈ నేపథ్యంలో ఆదివారం రాజస్థాన్లోని జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఆర్మీ, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఒక పేలుడు పదార్థాన్ని గుర్తించారు. అనంతరం సురక్షితంగా దానిని ధ్వంసం చేశారు. దీంతో దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. పెద్దగా పేలుడు శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు కొంత భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కాల్పుల విరమణతో భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూముల్లో పేలుడు పదార్థాలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే వాటి ఫొటోలు లేదా వీడియోలు తీయవద్దని, సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని కోరారు.
VIDEO | Indian Army defuses projectile found in Jaisalmer yesterday.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/GUJbMSs7k3
— Press Trust of India (@PTI_News) May 11, 2025