నోయిడా, జనవరి 22: రావణుడి ఆలయంలోకి శ్రీరాముడు ప్రవేశించడటమేంటని అనుకుంటున్నారా? యూపీలో నోయిడాలోని బిశ్రాక్ గ్రామంలో రావణుడ్ని పూజించే ఆలయముంది. అత్యంత పురాతమైన శివాలయంలో రావణుడిని ఇక్కడివారు దేవుడిగా భావిస్తూ విగ్రహాన్ని పూజిస్తారు. తమ గ్రామంలోనే రావణు డు జన్మించాడని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. అయితే.. అయోధ్య రామాలయ వేడుక నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ ఆలయం ఆవరణలోకి లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాల్ని తీసుకొచ్చారు.