Minister OP Rajbhar | లక్నో: రామ బంటు హనుమంతుడు రాజ్భర్ కులంలో జన్మించినట్లు ఉత్తరప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ శనివారం చెప్పారు. బాలియాలోని వాసుదేవ గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, “హనుమాన్ జీ రాజ్భర్ కులంలో జన్మించారు.
అహిరావణాసురుడు శ్రీరాముడిని, లక్ష్మణుడిని పాతాళ పురికి పట్టుకెళ్లిపోయినపుడు, వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ఎవరికీ ధైర్యం లేకపోయింది. కేవలం రాజ్భర్ కులంలో పుట్టిన హనుమంతునికి మాత్రమే ఆ ధైర్యం ఉంది. రామలక్ష్మణులను హనుమంతుడు పాతాళపురి నుంచి తిరిగి తీసుకొచ్చారు” అని చెప్పారు.