రాంచి, జూన్ 8: గిరిజన నాయకుడు కార్తీక్ ఉరావ్కి అంకితం చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జూన్ 5న ప్రారంభించిన సిర్మటోలి-మేకాన్ ఫ్లై ఓవర్ రాంచి నగరానికి కొత్త అందాలు తీసుకువచ్చింది. ఈ వంతెనను అద్భుతం, అసాధారణం, చిరస్మరణీయంగా అభివర్ణిస్తూ రాత్రి వేళ ఫ్లైఓవర్ అందాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోరెన్ అభివర్ణించారు.
రూ.372 కోట్ల వ్యయంతో నిర్మించిన 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ అద్భుతమైన డిజైనింగ్‌తో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజయంతంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దేశంలో రైల్వే లైను పైన నిర్మించిన మొట్టమొదటి అతి పొడవైన కేబుల్ వంతెన ఇదే కావడం విశేషం. 12 మోనోపైల్స్(స్తంభాలు)తోపాటు 72 కేబుళ్లను ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఉపయోగించారు.