న్యూఢిల్లీ, జూన్ 13: దీర్ఘకాల సహజీవనాన్ని పెండ్లిగానే భావించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న జంటకు పుట్టారన్న కారణంతో వారి పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తిని నిరాకరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. వారసత్వ ఆస్తిలో వారికి కూడా హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది. సహజీవనంలో ఉన్నవారికి పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు లేదన్న కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసింది.