న్యూఢిల్లీ : అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. సభ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాజ్యసభ, లోక్‌సభ పలుమార్లు వాయిదా పడ్డాయి. విపక్ష, అధికార పక్షాల నినాదాల నడుమ ఇరు సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.
మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లారు. జార్జ్ సోరోస్‌తో సంబంధాలపై సమాధానం చెప్పాలంటూ రాజ్యసభలో జేపీ నడ్డా కాంగ్రెస్‌ను ప్రశ్నించటంతో గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యులు సభలో అదానీ అవినీతి అంశాన్ని లేవనెత్తారు. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభ మరుసటి రోజుకు వాయిదా పడింది.