Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికలు.. ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీ సోషల్ మీడియా క్యాంపెయిన్..!
Lok Sabha Polls | ప్రజాస్వామ్య పండుగ యావత్ దేశం సిద్ధమవుతున్నది. మరో వైపు రాజకీయ పార్టీలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
Lok Sabha Polls | ప్రజాస్వామ్య పండుగ యావత్ దేశం సిద్ధమవుతున్నది. మరో వైపు రాజకీయ పార్టీలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయంలో ఓటింగ్ శాతాన్ని పెంపుపై దృష్టి సారిస్తున్నది. ఇందుకోసం ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.
సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగున్న విషయం తెలిసిందే. తొలి విడత ఈ నెల 19న మొదలుకానుండగా.. చివరి దశ పోలింగ్ జూన్ 1న ఉంటుంది. ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం యువ ఓటర్లను ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నది. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రావాలని పిలుపునిచ్చింది. ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓటింగ్ యంత్రాంగంతో సహా ఎన్నికల ప్రక్రియ ప్రాధాన్యాన్ని వివరించే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో సామాజిక మాధ్యామాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు ఎన్నికల సంఘం ‘వెరిఫై బిఫోర్ యు యాంప్లిఫై’ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడమే ఈ ప్రచారం లక్ష్యమని చీఫ్ సెలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు ఖచ్చితత్వం, ప్రామాణికతను ధ్రువీకరించేందుకు ఓటర్లను శక్తివంతం చేయడం.. తద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని తగ్గించడం.. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడడం తమ లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
RC 17 | సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్.. బరువు తగ్గడం కోసం ప్రత్యేక శిక్షణ!
ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

