Lok Sabha | లోక్‌సభలో రెండో రోజూ కొనసాగిన గందరగోళం.. రేపటికి వాయిదా
Lok Sabha | అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
న్యూఢిల్లీ: రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండా సభ వాయిదాపడుతూ వస్తున్నది. అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
ఇవాళ రెండో విడతలో భాగంగా రెండో రోజు సమావేశాలు ప్రారంభంకాగానే కాంగ్రెస్ సభ్యులు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టుబట్టారు. తమతమ స్థానాల్లో లేచి నిలబడి జేపీసీ డిమాండ్‌తో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు బీజేపీ సభ్యులు లండన్‌లో రాహుల్‌గాంధీ దేశం గురించి తక్కువచేసి మాట్లాడాడని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దాంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ ఓంబిర్లా ఇరువర్గాల సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో సభ ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. ఆ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. కాగా సోమవారం కూడా ఇవే అంశాలపై అధికార, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉభయసభలు వాయిదాపడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

