మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 11:45:36

రాజ‌స్థాన్‌లో పంట‌ల‌పై మిడ‌త‌ల దాడి

రాజ‌స్థాన్‌లో పంట‌ల‌పై మిడ‌త‌ల దాడి

జైపూర్‌: ప‌్ర‌భుత్వాలు, అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఉత్త‌రాది రాష్ట్రాల్లో మిడ‌త‌ల బెడ‌ద త‌గ్గ‌డంలేదు. సౌదీ అరేబియా నుంచి పాకిస్థాన్ మీదుగా దేశంలో ప్ర‌వేశించిన మిడ‌తల గుంపులు రాజ‌స్థాన్‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా త‌దిత‌ర రాష్ట్రాల్లో పంట పొలాల‌పై దాడులు చేస్తున్నాయి. తాజాగా రాజ‌స్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా స‌ర్‌మ‌థుర ఏరియాలో మిడ‌త‌లు బీభ‌త్సం సృష్టించాయి.

సోమ‌వారం ఉద‌యాన్నే దాదాపు 10 నుంచి 15 మిడ‌త‌ల గుంపులు స‌ర్‌మ‌థుర ఏరియాలో ప్ర‌వేశించాయి. చుట్టుప‌క్క‌ల ఆరేడు గ్రామాల్లో పంట‌ల‌ను ధ్వంసం చేశాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి ఆ మిడ‌త‌ల గుంపులు వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఆ మిడ‌త‌ల గుంపుల‌ను నిర్మూలించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. పంట‌ల‌పై ర‌సాయనాలు స్ప్రే చేసి త‌రుముతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo