man reunites with family | వ్యక్తిని నేరస్తుడిగా అనుమానించిన స్థానికులు.. పోలీసుల జోక్యంతో 8 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిశాడు
man reunites with family | ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బులు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నేరస్తుడిగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 8 ఏళ్ల కిందట కుటుంబాన్ని వీడిన ఆ వ్యక్తి అడుక్కొని జీవిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో అతడ్ని కలిపారు.
బెంగళూరు: ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బులు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నేరస్తుడిగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 8 ఏళ్ల కిందట కుటుంబాన్ని వీడిన ఆ వ్యక్తి అడుక్కొని జీవిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో అతడ్ని కలిపారు. (man reunites with family) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురుసిద్దప్ప అనే వ్యక్తి వద్ద సుమారు రూ.60,000 ఉండటాన్ని స్థానికులు గమనించారు. అతడు నేరగాడు అయ్యి ఉంటాడని అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అతడి సంచి, వస్తువులను పోలీసులు తనిఖీ చేయగా భారీగా చిల్లర నాణేలు కనిపించాయి.
కాగా, గురుసిద్దప్పను పోలీసులు ప్రశ్నించారు. అతడి గురించి ఆరా తీయగా మాదాపుర గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. సుమారు ఎనిమిదేళ్ల కిందట కుటుంబ సభ్యులతో గొడవ వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి బెగ్గర్‌గా జీవిస్తూ సుమారు రూ.60,000 కూడబెట్టాడు.
మరోవైపు గురుసిద్దప్పకు భార్య, కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారికి అతడి గురించి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన గురుసిద్దప్ప చివరకు ఊహించని విధంగా తన కుటుంబం చెంతకు చేరుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

