LoC | జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వారాల్లో నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టేలా కాల్పులు జరిపాయి. భారత ఆర్మీ సైనికులు వేగంగా స్పందించి ధీటుగా బదులిచ్చిందని సైన్యం పేర్కొంది.
భారత్ – పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఆరోసారి. ఈ నెల ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26మంది పర్యాటకులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా చంపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఆ దేశానికి చెందిన మంత్రలు భారత్తో పాటు దాడుల గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఈక్రమంలో ఆ దేశ సైన్యం సైతం సరిహద్దుల వెంట నిరంతరం కాల్పులు విరమణను ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే వరుసగా ఆరవ రోజు కాల్పులు జరుపుతూ వచ్చింది.