న్యూఢిల్లీ : పాకిస్తానీ వైరల్ సెన్సేషన్ ఆయేషా తాజాగా ఫ్రాన్స్ వీధుల్లో మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు డ్యాన్స్ వేసిన చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు పాక్ యువతి ఆయేషా రీమిక్స్ వెర్షన్ డ్యాన్స్ ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వీడియోతో ఆయేషా రాత్రికి రాత్రి ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక ఫ్రాన్స్‌లోని స్ట్రీట్‌లో చిన్నారి రైనా మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తీరు ఆయేషాను ఆకట్టుకోవడంతో ఆ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోలో ఆయేషా స్టెప్స్‌ను అనుకరించేందుకు ఈ వీడియోలో రైనా ప్రయత్నించింది.
డ్యాన్సింగ్ ఆన్ దిస్ సూపర్ ట్రెండింగ్ సాంగ్ అని ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇవ్వగా ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. రైనా సూపర్బ్ పెర్ఫామెన్స్‌కు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. బ్యూటిఫుల్, నైస్, సూపర్బ్ అంటూ చిన్నారిని ప్రశంసించారు.