బెంగళూరు, జనవరి 25: జానపద సాహిత్య పరిశోధకులు, సాహితీవేత్త ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు(90) కన్నుమూశారు. శనివారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 1935లో పశ్చిమ గోదావరి జిల్లా కాకుల ఇల్లిందలపర్రులో జన్మించారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చదివారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులుగా పని చేశారు. శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్యను స్థాపించారు.