హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులను వర్చువల్‌గా విచారించింది. ఆ చార్జిషీట్లోని కొన్ని పేజీలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదించి ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ సీబీఐ అధికారులు మళ్లీ అవే కాపీలను ప్రతివాదులకు పంపడంపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివాదులకు స్పష్టమైన చార్జిషీట్ ప్రతులను అందజేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేశారు.
రేప్ కేసులో నటుడి అరెస్ట్
న్యూఢిల్లీ: మహిళా నటిపై లైంగిక దాడి కేసులో మళయాళ నటుడు, ఎడవెల బాబును సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘అమ్మ’లో సభ్యత్వం నిమిత్తం దరఖాస్తు నింపేందుకు బాబు నివాసానికి వెళ్లినప్పుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నటుడిని అరెస్ట్ చేశారు.
లాభాల్లో 33 శాతం వాటా చెల్లించాలి
సీసీసీ నస్పూర్/మందమర్రి/రెబ్బెన, సెప్టెంబర్ 25 : సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని జీఎం కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మ ణ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. మందమర్రి జీఎం కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించి ఎస్వోటు జీఎం రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు.