Woman’s Chopped Body On Train | ఇనుప పెట్టెలో మహిళ మృతదేహం.. రైలు స్లీపర్ కోచ్‌లో లభ్యం
Woman's Chopped Body On Train | రైలు స్లీపర్ కోచ్‌లో అనుమానాస్పద ఇనుప పెట్టెను పారిశుధ్య సిబ్బంది గుర్తించారు. తాళం పగులగొట్టి దానిని తెరిచి చూడగా మహిళ మృతదేహం భాగాలున్నాయి.
లక్నో: రైలు స్లీపర్ కోచ్‌లో అనుమానాస్పద ఇనుప పెట్టెను పారిశుధ్య సిబ్బంది గుర్తించారు. తాళం పగులగొట్టి దానిని తెరిచి చూడగా మహిళ మృతదేహం భాగాలున్నాయి. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పెట్టె, బ్యాగులో ఉంచి రైలులో వదిలేసినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman’s Chopped Body On Train) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ఛప్రా నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు, లక్నోలోని గోమతి నగర్ స్టేషన్లో ప్రయాణాన్ని ముగించింది.
కాగా, సోమవారం ఉదయం ఆ రైలు కోచ్‌లను పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తుండగా ఒక స్లీపర్ కోచ్ సిటు కింద వదిలేసిన ఇనుప పెట్టె, ఒక బ్యాగ్‌ను వారు గుర్తించారు. రక్తం మరకలు ఉండటంతో అనుమానించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఇనుప పెట్టె తాళం పగులగొట్టి చూడగా మహిళ మృతదేహం భాగాలు ఉన్నాయి. మొండెం, వేరు చేసిన తల భాగాలు పెట్టెలో, కాళ్లు, చేతుల భాగాలను పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి బట్టల మధ్య దాచి బ్యాగ్‌లో ఉంచడాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు.
మరోవైపు మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఆమె గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన హంతకులు ఇనుప పెట్టె, బ్యాగులో వాటిని ఉంచి రైలులో వదిలేసినట్లు అనుమానించారు. ఆ రైలు ప్రయాణించిన అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Railway staff in Lucknow found a decapitated female torso (25-30 yrs) in a box & severed limbs in a bag inside a sleeper coach of a train from Chhapra via Gorakhpur to Gomti Nagar. FIR filed, post-mortem done, probe underway. Head missing, identification pending. pic.twitter.com/LFj1FU1icu
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BOX
- Chopped Body
- limbs
- packed
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

