Life Sentence : సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని నెలలపాటు జనాన్ని ఇళ్లకే బందీలను చేసింది. అలాంటి సమయంలో ఓ కొవిడ్ బాధితురాలిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2020 సెప్టెంబర్‌లో కేరళకు చెందిన ఓ 19 ఏళ్ల యువతికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో అమెను మెడికల్ కేర్ సెంటర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించే బాధ్యతను నౌఫాల్ అనే అంబులెన్స్ డ్రైవర్‌కు అప్పగించారు. అతను ఆ యువతిని కొవిడ్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లకుండా మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 55 మంది సాక్షులను విచారించి ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన స్థానిక కోర్టు గురువారం నౌఫాల్‌ను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం అతనికి జీవితఖైదు ఖరారు చేసింది. అదేవిధంగా బాధితురాలికి రూ.1.08 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.