ISRO | కోల్‌కతా, ఆగస్టు 7: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడ్ని చేరుకోవడానికి 40 రోజులకుపైగా పడుతున్నది. మన రాకెట్లు శక్తివంతమైనవి కాకపోవటమే దీనికి కారణమని ఇస్రో మాజీ సైంటిస్ట్ తపన్ మిశ్రా అన్నా రు. స్లింగ్-షాట్ మెకానిజం(నిల్వ చేసిన ఎలాస్టిక్ శక్తితో వేగాన్ని పెంచే ప్రక్రియ) ద్వారా వాటి వేగాన్ని పెంచుతూ చంద్రయాన్-3ని ప్రయోగించారని ఆయన చెప్పారు. భూ గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని రాకెట్ దూసుకుపోవాలంటే, దాని వేగం సెకన్‌కు 11.2 కిలోమీటర్ల పైనే ఉండాలి. చంద్రయాన్‌ను స్లింగ్-షాట్ మెకానిజం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి పంపారని తపన్ చెప్పారు.