Pulwama Encounter | పుల్వామాలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో (Larrow-Parigam) ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని లష్కరే తొయీబా (Lashkar-e-Taiba) కమాండర్‌గా (Commander) అనుమానిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
రెండు వారాల క్రితం రాజౌరీ (Rajouri) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. ఆగస్టు 5న రాష్ట్రీయ రైఫిల్స్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

