శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గత ఏడు రోజుల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్(Uzair Khan).. భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందాడు. ఆ ఉగ్రవాది నుంచి ఓ వెపన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉజైర్ ఖాన్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన మృతదేహాన్ని ఎన్కౌంటర్ స్థలంలో గుర్తించినట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉజైర్ ఖాన్ మృతితో.. అనంత్‌నాగ్‌లో గత ఏడు రోజుల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తి అయినట్లు ఆయన చెప్పారు. అనంత్‌నాగ్ ఎన్కౌంటర్లో నలుగురు సైనికులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.