Landmine blast | మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా పేలుడు.. ముగ్గురు జవాన్లు దుర్మరణం
Landmine blast | ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) లో ఘోరం జరిగింది. గతంలో మావోయిస్టులు (Maoists) అమర్చిన శక్తిమంతమైన మందుపాతర (Landmine) ను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) కి చెందిన ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Landmine blast : ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) లో ఘోరం జరిగింది. గతంలో మావోయిస్టులు (Maoists) అమర్చిన శక్తిమంతమైన మందుపాతర (Landmine) ను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) కి చెందిన ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మందుపాతరలు తొలగించే ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇవాళ (శనివారం) మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు డీమైనింగ్, ఏరియా డామినేషన్ ఆపరేషన్లు చేపట్టాయి. అందులో భాగంగా ఛోటే బేతియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ బృందం మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఒక ఐఈడీ ఊహించని విధంగా పేలింది. ఈ పేలుడులో ఇన్స్పెక్టర్ సుఖ్రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కోమ్రా, మరో కానిస్టేబుల్ సంజయ్ గఢ్‌పాలే అక్కడికక్కడే మృతి చెందారు.
మరో కానిస్టేబుల్ పర్మానంద్ కోమ్రా తీవ్రంగా గాయపడగా అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పట్టిలింగం స్పందించారు. ఇటీవలి కాలంలో లొంగిపోయిన మావోయిస్టులు, నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వందలాది ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేశామని చెప్పారు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఓ ఐఈడీని నిర్వీర్యం చేస్తుండగా పేలిందని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసం డీఆర్జీ దళాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
కాగా మార్చి 31న రాష్ట్రాన్ని సాయుధ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇదే మొదటి పేలుడు ఘటన కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

