న్యూఢిల్లీ : భూమిని దాని యజమాని వినియోగించుకోకుండా నిరవధికంగా ఆపకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. భూమిని ఫలానా విధంగా వినియోగించరాదని నిషేధాజ్ఞను జారీ చేసినపుడు, ఆ నిషేధాజ్ఞను అనంత కాలంపాటు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
33 ఏండ్ల నుంచి స్థలాన్ని డెవలప్మెంట్ ప్లాన్లో రిజర్వు చేసి ఉంచడంలో అర్థం లేదని చెప్పింది. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రాంతీయ, పట్టణ ప్రణాళిక చట్టంలోని సెక్షన్ 127ను ప్రస్తావించింది. ఈ భూమిని అసలు యజమానులనే కాకుండా, దాని కొనుగోలుదారులను కూడా అధికారులు అనుమతించడం లేదని వ్యాఖ్యానించింది.