Lalu Prasad Yadav | ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ ఆఫర్‌కు నేనూ ఆకర్షితుడినయ్యా: లాలూ
Lalu Prasad Yadav | స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్‌కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తెలిపారు. దాని కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకు ఖాతా కూడా తెరిచినట్లు చెప్పారు.
ముంబై: స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్‌కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తెలిపారు. దాని కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకు ఖాతా కూడా తెరిచినట్లు చెప్పారు. అయితే ఇలాంటి అబద్ధాలు చెప్పిన మోదీ తిరిగి అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అబద్ధాలు, పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
కాగా, తనతోపాటు మరి కొందరు నేతల పేరుతో స్విస్ బ్యాంకుల్లో కోట్లలో డబ్బులు ఉన్నాయని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని మోదీ అన్నారని గుర్తు చేశారు. ‘నేను కూడా ఈ ఆఫర్‌కు ఆకర్షితుడినయ్యా. కుటుంబంతో కలిసి బ్యాంకు ఖాతా తెరిచా. అయితే నరేంద్ర మోదీ చేస్తున్న అవినీతి నేను చేయలేదు’ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలోని మైనారిటీలకు భద్రత లేదని ఆరోపించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కాకపోవడం వల్ల దేశం బాధ పడుతోందని అన్నారు.
#WATCH | RJD chief Lalu Prasad Yadav says, "…You must recall how they (BJP-NDA) came to power by lying and spreading rumours. They took my name as well as that of several other leaders' names that we have money in Swiss Banks. PM Modi said that he would come to power, get back… pic.twitter.com/39pUq5q7MK
— ANI (@ANI) September 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

