Madhya Pradesh: స్కూల్లో ప్రిన్సిపల్ వర్సెస్ లైబ్రేరియన్.. సిగలు పట్టుకుని కొట్టుకున్నారు.. వీడియో
Madhya Pradesh: మహిళా ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ గొడవ పడ్డారు. ఒకరి సిగ ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ స్కూల్లో జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతున్నది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఏకలవ్య ఆదర్శ స్కూల్లో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ కొట్టుకున్నారు. ఒకరి సిగలు ఒకరు పట్టుకుని పంచ్‌లు విసురుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గోనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహిళా ప్రిన్సిపాల్, ఆ స్కూల్ లైబ్రేరియన్ ఓ విషయం వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ గొడవ మరింత పెద్దగా మారింది. గట్టిగా అరుస్తున్న లైబ్రేరియన్ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్‌ను లాక్కొన్ని నేలకు కొట్టింది. ఆ టైంలో ఆ ఇద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది.
వాగ్వాదాన్ని రికార్డు చేస్తున్న సమయంలో ప్రిన్సిపాల్ ఫోన్ లాక్కుకున్నది. దీంతో లైబ్రేరియన్ ఆగ్రహానికి గురైంది. ఆ టైంలో లైబ్రేరియన్‌పై చేయి చేసుకున్నది ప్రిన్సిపాల్. ఫోన్ లాక్కుని నేలకు కొట్టింది. మీకెంత ధైర్యం అని లైబ్రేరియన్ అడుగుతుండగా మళ్లీ అటాక్ చేసింది ప్రిన్సిపాల్. కింద పడ ఫోన్‌ను తీసి మళ్లీ నేలకు కొట్టింది ప్రిన్సిపాల్. అయితే లైబ్రేరియన్ మళ్లీ నిలదీయడంతో ..ఆ గొడవను ప్రిన్సిపాల్ తన ఫోన్లో రికార్డు చేసే ప్రయత్నం చేసింది.
ఆ దశలో ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. సిగలు పట్టి గుంజుకున్నారు. ప్రిన్సిపాల్ చున్నీని లైబ్రేరియన్ లాగేసింది. ఒకరి జట్టు ఒకరు విడవకుండా గొడవ పడ్డారు. ఆ సమయంలో స్కూల్ స్వీపర్ వచ్చి ఆ ఇద్దర్నీ విడిపించింది. ఆ ఇద్దరు మహిళలపై అధికారులు వేటు వేశారు. ఘర్షణకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
The school principal and librarian indulged into a physical fight at the premises of a government Eklavya School in Madhya Pradesh’s Khargone.
In the video, it can be seen, both the officials slapped each other, pulled hair, and pushed each other. The principal also broke the… pic.twitter.com/nk2z63oWIL
— ForMenIndia (@ForMenIndia_) May 4, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

