Laddu Mar Holi : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని మధుర (Madhura) నివాసితుల హృదయాల్లో హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మధుర పట్టణం హోలి పండుగ సందర్భంగా రకరకాల రంగులు పులుముకుంటుంది. గుజియా, తండై లాంటి స్వీట్లు, గులాల్, నీటి బెలూన్లు దర్శనమిచ్చాయంటే.. మధుర హోలీకి సిద్ధమవుతోందని అర్థం. 2025 హోలీ ఉత్సవాలకు కూడా మధుర సిద్ధమైంది. ఈ హోలీ ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ కళా ప్రదర్శనలు ఉంటాయి. జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు. రకరకాల రంగులు చల్లుకుంటారు.
ఈ హోలీ ఉత్సవాల్లో భాగంగా హోలీ పౌర్ణమికి సరిగ్గా వారం రోజుల ముందు యూపీ రాష్ట్రంలోని బర్సానాలో లడ్డూ హోలీ వేడుకను జరుపుకుంటారు. బర్సానాలోని లాడ్లీ మహరాజ్ ఆలయంలో ఈ వేడుకలు జరుగుతాయి. లడ్డూ మార్ హోలీ పేరుతో ఈ హోలీ వేడుకలు జరుగుతాయి. ఇవాళ లాడ్లీ మహరాజ్ ఆలయంలో జరుగుతున్న హోలీ వేడుకలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | ‘Laddu Mar’ Holi being celebrated in Shri Ladliji Maharaj temple in Barsana, Uttar Pradesh pic.twitter.com/EOOFMtkB8l
— ANI (@ANI) March 7, 2025