LAC Row | తూర్పు లడఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. మూడు సంవత్సరాల సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి, ఆదివారం తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్ మోల్డోలో భారతదేశం చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం మరోసారి జరిగింది. ఈ 18వ రౌండ్ చర్చల్లో సరిహద్దు వివాదంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన చర్చలు జరిగాయి. కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి చర్చల్లో పాల్గొన్నారు.
దాదాపు ఐదు నెలల విరామం తర్వాత సమావేశం జరిగింది. ఇరుదేశాల మధ్య చివరి సమావేశం 2022 డిసెంబర్లో జరిగింది. దేప్సాంగ్ మైదానాలు, డెమ్చోక్, ఇరువైపులా బలగాల ఉపసంహరణ అంశాన్ని భారత్ సమావేశంలో లేవనెత్తింది. వాస్తవానికి 2020లో కరోనా సమయంలో చైనా నుంచి వాస్తవ నియంత్రణ రేఖ, వాస్తవ రేఖపై యథాతథ స్థితిని మార్చేందుకు భారీ ఆయుధాలు, పెద్ద సంఖ్యలో సైనికులను దూకుడుగా తరలించిన తర్వాత సమస్యలను పరిష్కరించడానికి తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు ప్రారంభించాయి.
పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు వెనక్కి తగ్గేందుకు అంగీకరించాయి. రెండు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇంకా చాలా విషయాలకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నేటి చర్చల్లో కూడా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. అపరిష్కృతంగా ఉన్న మిగతా సమస్యలను వీలైనంత త్వరగా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేసేందుకు అంగీకరించాయి.