ఖుషీనగర్లో విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ

ఖుషీనగర్: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనున్నది. దశాబ్ధాల ఆశలు, ఆశయాల ఫలితమే కుషీనగర్ విమానాశ్రయమని, ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, ఇదో ఆధ్యాత్మిక ప్రయాణమని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ఖుషీనగర్ విమానాశ్రయం కేవలం ఎయిర్ కనెక్టివిటీ మాత్రమే కాదు అని, రైతులు, జంతు ప్రేమికులు, షాప్ ఓనర్లు, వర్కర్లు స్థానిక పారిశ్రామికవేత్తలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వ్యాపార సముదాయ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందన్నారు. ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక రంగం ఎక్కువగా లబ్ధి పొందుతోందన్నారు. స్థానిక యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రానున్న 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు.
గౌతమ బుద్దుడితో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. బౌద్ద భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఖుషీనగర్ అభివృద్ధి కేంద్ర, యూపీ ప్రభుత్వ ఎజెండాలో ఉందన్నారు. యూపీలో కొత్తగా 9 విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని, జివార్ విమానాశ్రయం దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవుతుందని ప్రధాని తెలిపారు. అంతకుముందు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా.. ప్రధాని మోదీని సన్మానించారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బుద్ధుడిని ఫాలోఅవుతున్న వారికి ఖుషీనగర్ ఓ ప్రధాన పర్యాటక ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులు ఇక్కడకు వస్తుంటారు. గౌతమ బుద్ధుడు ఇక్కడే మహానిర్యాణం పొందారు. బౌద్ద ఆధ్యాత్మిక యాత్రికులకు ఇదో చాలా ముఖ్యమైన యాత్రాస్థలం. ఖుషీనగర్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీలంక నుంచి తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో శ్రీలంక మంత్రులతో పాటు బౌద్ద మతగురువులు వచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

