న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన తాజా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు జామీను మంజూరు చేసింది. జస్టిస్ సుందర్ మోహన్ శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేశారు.
ముంబై పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలియచేస్తూ తనకు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కామ్రా హైకోర్టును ఆశ్రయించారు. తాను 2021లో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చానని, అప్పటి నుంచి తాను ఈ రాష్ట్ర పౌరుడినేనని కునాల్ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ సారి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఆయన టార్గెట్ చేశారు.