చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ తండ్రి కుమారి అనంతన్(Kumari Ananthan) కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. వయసు సంబంధిత రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారు. 1977లో నాగర్‌కోయిల్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన సాహితీవేత్తగా కూడా.
Chennai, Tamil Nadu: Senior Congress leader Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passed away at 93 due to age-related illness pic.twitter.com/GEWRRZcUSI
— ANI (@ANI) April 9, 2025
తమిళనాడు అసెంబ్లీకి అయిదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తమిళిసై సౌందర్యరాజన్ నివాసంలో ఇవాళ ఆయన పార్దీవదేహాన్ని ఉంచారు. కుమారి అనంతన్ మరణవార్తకు సంబంధించిన అంశాన్ని తమిళిసై తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. పార్లమెంట్లో తమిళంలో మాట్లాడిన తొలి వ్యక్తి తన తండ్రి అని ఆమె పేర్కొన్నారు.
தமிழ் கற்றதனால் நான் தமிழ் பேசவில்லை… தமிழ் என்னைப் பெற்றதனால் நான் தமிழ் பேசுகிறேன் என்று…. பெருமையாக . பேச வைத்த என் தந்தை திரு.குமரி அனந்தன் அவர்கள்… இன்று என் அம்மாவோடு.. இரண்டர கலந்து விட்டார்… குமரியில்.. ஒரு கிராமத்தில் பிறந்து.. தன் முழு முயற்சியினால்…… pic.twitter.com/MxDWOHg5OJ
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) April 8, 2025