కోల్కతా : కృష్ణనగర్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కృష్ణనగర్ జిల్లా కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జూన్ 12న మహువా తన సోషల్ మీడియా ఖాతాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారత సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి.
అలాగే జూన్ 17న మహువా బురఖా వేసుకునే మహిళలపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కృష్ణనగర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుల విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు కోర్టు ఆదేశించినా ఆమె రాలేదు. ఆగస్టు 18లోపు హాజరు కావాలని కోర్టు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆగస్టు 19న సాయంత్రం 5 గంటల్లోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో.. కోర్టు ధిక్కరణ కింద ఆమెను అరెస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.