KPCC president : కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ ‘కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Kerala Pradesh Congress Committe)’ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కే సుదర్శన్ ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్, ఎంపీ షరీఫ్ పరంబిల్, ఎమ్మెల్యే ఏపీ అనిల్‌కుమార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎంపీ అడూర్ ప్రకాష్ యూడీఎఫ్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో జోసెఫ్‌తోపాటు విష్ణునాథ్, పరంబిల్, అనిల్ కుమార్.. త్రిసూర్‌లో కేరళ కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా కొట్టాయంలో మాజీ సీఎం ఊమెన్ చాందీ స్మారకం వద్ద కూడా వారు నివాళులు అర్పించారు.