కోటా, ఆగస్టు 18: రాజస్థాన్‌లోని కోటాలో ఇటీవల కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దీంతో ఆత్మహత్యల నివారణకు అన్ని హాస్టళ్లు, ఇతర పీజీ వసతి గృహాల్లోని గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు స్ప్రింగ్ డివైస్‌ను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. అన్ని వసతి గృహాల వారు ఈ స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను కచ్చితంగా అమర్చాలని, అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్‌పై 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేస్తే ఈ స్ప్రింగ్ కిందకు సాగిపోతుంది.