Kolkata Case | రేపు 5గంటల్లోగా విధులకు హాజరుకావాలి.. వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశం..!
Kolkata Case | కోల్‌కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం సైతం రిపోర్టును సైతం కోర్టుకు సమర్పించింది.
Kolkata Case | కోల్‌కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం సైతం రిపోర్టును సైతం కోర్టుకు సమర్పించింది. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఆ తర్వాత సీబీఐ కొత్త స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. విధులకు వచ్చిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే, ఇంకా వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధులకు హాజరుకావాలని చెప్పింది.
నిరంతరాయంగా విధులకు గైర్హాజరయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ నివాసం, ఆసుపత్రికి మధ్య దూరాన్ని సీజేఐ అడిగి తెలుసుకున్నారు. దీనికి మెహతా స్పందిస్తూ సుమారు 15 నుంచి 20 నిమిషాల ప్రయాణం ఉంటుందని చెప్పారు. వైద్యురాలు మనందరికీ కూతురులాంటిదని.. ఈ కేసులో దోషులను వీలైనంత త్వరగా శిక్షించాలని సొలిసిటర్ జనరల్ కోరారు. విచారణ సందర్భంగా అసహజ మరణ రిపోర్ట్‌ను దాఖలు చేసే సమయంపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. ఈ సందర్భంగా సీసీటీవీ ఫుటేజీ, సీబీఐకి అందించిన ఆధారాలపై సైతం ధర్మాసనం వివరాలు అడిగి తెలుసుకున్నది. కోల్‌కతా ప్రభుత్వం ఇచ్చిన నమూనాలను ఎయిమ్స్, ఇతర కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపాలని సీబీఐ నిర్ణయించిందని ఎస్జీ మెహతా ధర్మాసనానికి తెలిపారు. పోర్టుమార్టం నివేదికపై మరో న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. వెజినల్ స్వాబ్ నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలని.. కానీ అలా చేయలేదన్నారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఎప్పుడు పోస్టుమార్టం చేశారన్న ప్రస్తావన లేదని సొలిసిటర్ జనరల్ చెప్పారు. అత్యాచారం, హత్య కేసులో మొదటి ఐదుగంటలు కీలకమని ఎస్జీ మెహతా పేర్కొన్నారు. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత విచారణ చేపట్టిన సీబీఐకి ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో దర్యాప్తుపై కొత్త స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో మోహరించిన భద్రతా సిబ్బందికి సంబంధించిన సమస్యను ఎస్జీ తుషార్ మెహతా లేవనెత్తారు. సీఐఎస్ఎస్ఎఫ్కు చెందిన మూడు కంపెనీలకు వసతి కల్పించాలని బెంగాల్ హోంశా సీనియర్ అధికారి, సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారిని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ రాత్రి 9 గంటలకు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాలని స్పష్టం చేసింది. అయితే, ఐకార్డ్ లేకుండా ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించడంతోపాటు వైద్యుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. సోషల్ మీడియా నుంచి బాధితురాలి చిత్రాలన్నింటినీ వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

