Sandip Ghosh | దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్ కతా వైద్య విద్యార్థినిపై లైంగికదాడి, హత్య కేసులో ఆర్డీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మరింత చిక్కుల్లో పడ్డారు. వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డారని ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అభియోగం మోపింది. ఇప్పటికే ఈ కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది.
గత నెల తొమ్మిదో తేదీన కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ దవాఖానలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మీద లైంగిక దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సందీప్ ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఆయనపై అదనపు అభియోగాలు నమోదయ్యాయి. పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. దర్యాప్తు అధికారులను సందీప్ ఘోష్ తప్పుదోవ పట్టించారని, సాక్షాధారాలను దాచి పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు సందీప్ ఘోష్ తోపాటు ఒక పోలీసు అధికారి ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.