న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణించడంతో ఆమె కిరీటంలోని ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకొంటున్నాయి.
ఎలిజబెత్-2 మరణానంతరం ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ యువరాజు చార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు అధినేతగా వ్యవహరించనుండటంతో ఆయన సతీమణి కెమిల్లాకు రాణి హోదాతోపాటు 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని పొదిగివున్న కిరీటం లభించనున్నది.
ఈ వజ్రానికి అసలు యజమాని ఎవరన్న దానిపై ఏండ్లుగా వివాదం కొనసాగుతున్నది. కాగా, బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి సంతాప సూచకంగా ఈ నెల 11న అన్ని ప్రభుత్వ కార్యాల యాలపై భారత జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.