తిరువనంతపురం, జూన్ 18: మార్నింగ్ వాక్ కోసం రోడ్డునే బ్లాక్ చేయించాడో పోలీస్ ఉన్నతాధికారి. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొన్నది. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వినోద్ పిైళ్లె ప్రతి రోజు మార్నింగ్ వాక్ చేసేందుకు బారికేడ్లతో రోడ్డు బ్లాక్ చేయిస్తున్నారు.
వాస్తవానికి ఆదివారాల్లో మాత్రమే పిల్లల కోసం ఉదయం 6-7 గంటల మధ్య రోడ్డును మూసేయాలి. కానీ, మిగతా రోజుల్లోనూ ఆ పోలీస్ రోడ్డును మూసేయించారు. ఏంటా అని ఆరా తీస్తే మార్నింగ్ వాక్ కోసమని తేలింది. దీంతో ఆయనకు సంబంధిత ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీచేశారు.