న్యూఢిల్లీ, అక్టోబర్ 19: సాధారణంగా కీళ్ల వాతం వయసు మీరిన వాళ్లలో చూస్తుంటాం. 50 ఏండ్లు దాటితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, యువకులు కూడా కీళ్లవాతం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తెలిపింది. 30 ఏండ్ల వయసు పైబడినవారు ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు ఢిల్లీకి చెందిన ఇంద్రపస్థ అపోలో దవాఖాన డాక్టర్ డాక్టర్ యశ్గులాటీ తెలిపారు.
20 ఏండ్ల యువకుల్లోనూ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. జీవనశైలిలో మార్పుల కారణంగా కీళ్లవాతం అన్ని వయస్సులవారిలో కనిపిస్తున్నదని పేర్కొన్నారు.