న్యూఢిల్లీ : రూ 100 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో గురుగ్రాంలోని థీమ్ పార్క్ కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్‌ను హర్యానా షెహ్రి వికాస్ ప్రాధికరణ్ (హెచ్‌ఎస్‌వీపీ) సీల్ చేసింది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో గ్రేట్ ఇండియన్ నౌటంకి కంపెనీ ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్‌ను నెలకొల్పింది.
కల్చర్ గల్లీగా పేరొందిన ఈ థీమ్ పార్క్‌లో విలాసవంతమైన క్యూజిన్, సాంస్క్రతిక వైభవం ఉట్టిపడేలా కట్టడాలున్నాయి. షోకేస్ థియేటర్, నౌటంకి మహల్ సహా ఈ సెంటర్లో పలు ఆకర్షణలతో కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్ సందర్శకులు, పర్యాటకులను స్వాగతిస్తోంది.