IAS Coaching | పాట్నా: ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందిన ఓ వ్యక్తి (25) యూపీఎస్సీ కోచింగ్ ఫీజు కోసం నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు వెళ్లాడు. వర్షం పడుతున్నదని, ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలని ఓ మహిళను కోరాడు. ఆమె అంగీకరించడంతో ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఆమె గదిలోకి వెళ్లి, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె ఎనిమిదేళ్ల కుమారుడిని తీసుకుని నిందితుడు పారిపోయాడు. బాలుడిని విడిచిపెట్టాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దేవరియాలో బాలుడిని గుర్తించారు.
సౌత్ కొరియాలో తాజాగా నిర్వహించిన మిస్‌యూనివర్స్ కొరియా పోటీల్లో 81 ఏండ్ల బామ్మ చోయ్ సూన్-హ్వా పాల్గొని రికార్డు సృష్టించారు. యువతులతో పోటీ పడి ఔరా అనిపించారు. క్యాట్ వాక్‌తో హొయలొలికించారు. బామ్మకు కిరీటం దక్కకపోయినా.. బెస్ట్ డ్రెస్సర్ అవార్డు లభించింది. కాగా, ఈ పోటీల్లో 22 ఏండ్ల ఫ్యాషన్ స్కూల్ స్టూడెంట్ హన్ ఏరియల్ మిస్ కొరియన్ కిరీటాన్ని దక్కించుకుంది. నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు ఆమె దక్షిణకొరియా తరపున పాల్గొంటారు.