బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Karnataka Assembly Elections) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, శాసనసభలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన జగదీష్ శెట్టార్, శశి థరూర్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరితో పాటు రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా, కేసీ వేణుగోపాల్, హరిప్రసాద్, ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర, మునియప్ప, జైరాం రమేష్, వీరప్ప మొయిలీ, రామలింగారెడ్డి, సతీష్ జర్కిహోలి, డీకే సురేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, చంద్రశేఖర్, జమీర్ అహ్మద్ ఖాన్, రేవణ్ణ, ఉమాశ్రీ, భూపేష్ భాఘేల్, అశోక్ గెహ్లాట్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, పీ చిదంబరం, పృధ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, రేవంత్ రెడ్డి, రమేష్ చెన్నితల, బీవీ శ్రీనివాస్, రాజ్‌బబ్బర్, అజారుద్దీన్, దివ్య స్పందన, కన్నయ్య కుమార్, రూపా శశిధర్, సాధుకోకిల ఉన్నారు.
మరోవైపు నామినేషన్ల దాఖలు చివరి అంకానికి చేరడంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అగ్ర నేతల సుడిగాలి పర్యటనలకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే కర్నాటకలో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.