న్యూఢిల్లీ : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ (Khalistani Terrorist Pannun) ఆన్లైన్ వీడియోలో మరోసారి బెదిరింపులకు దిగాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని, భారత్‌లోనూ ఈ తరహా రియాక్షన్ ఉంటుందని నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ పన్నున్ హెచ్చరించాడు.
పంజాబ్ ఆక్రమణను భారత్ కొనసాగిస్తే రియాక్షన్ ఉంటుందని, భారత్, ప్రధాని మోదీ ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ వీడియోలో పన్నున్ రెచ్చిపోయాడు. బ్యాలెట్, ఓటు పట్ల ఎస్ఎఫ్జేకు విశ్వాసం ఉందని, పంజాబ్ విముక్తి జరగనుందని పేర్కొన్నాడు. కెమెరా వైపు షూట్ చేస్తూ ఈ వీడియోలో పన్నున్ చెప్పుకొచ్చాడు.
భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌కు ముందు బెదిరింపు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పన్నున్‌పై ఇటీవల ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. కెనడాలో టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఎస్ఎఫ్జే ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ వీడియో మెసేజ్‌లో పన్నున్ హెచ్చరించాడు.
Read More :
Elon Musk | ట్విట్టర్లో మరో కీలక మార్పు.. వాళ్లు మాత్రమే రిప్లయ్‌లు ఇవ్వగలరు..!