పుణె/ అహ్మదాబాద్: డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురూల్కర్ రక్షణకు శాఖకు చెందిన కీలక సమాచారాన్ని పాక్ గూఢచారికి చేరవేసినట్టు మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. పాక్‌కు చెందిన ఓ యువతి వలపు వలలో పడ్డ ఆయన ఆమెకు కీలక సమాచారాన్ని చేరవేశాడు. దీంతో ప్రదీప్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. చార్జిషీట్లో అతడు నేరానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ ఉద్యోగి కూడా…
బీఎస్ఎఫ్ ఎలక్ట్రికల్ డిపార్టు మెంట్లో పనిచేస్తున్న నీలేశ్ బాలియా పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి వలపు వలలో పడి ఆమెకు రక్షణ శాఖ సమాచారాన్ని చేరవేసినట్టు గుజరాత్ పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.