న్యూఢిల్లీ, జనవరి 16: మయన్మార్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం సెగ భారత సరిహద్దును తాకింది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న పాలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ ప్రకటించింది. 2021 నుంచి మయన్మార్లో సైనిక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య కూటములు ఓ సంస్థగా ఏర్పడి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.