తిరువనంతపురం: పసి బాలుడ్ని అతడి తల్లి, ప్రియుడు కలిసి కిరాతకంగా హింసించి చంపారు. బాలుడి మృతదేహంపై పలు గాయాలు ఉండటం చూసి కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు. పసి బాలుడి తల్లి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. (Toddler Abused To Death) కేరళంలోని తిరువనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నెడుమంగాడ్ ప్రాంతానికి చెందిన అఖిలకు మొదటి భర్త ద్వారా ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు అర్షిద్ ఉన్నాడు. కొంతకాలంగా అష్కర్ అనే వ్యక్తితో కలిసి ఆమె సహజీవనం చేస్తున్నది.
కాగా, మే 29న బాలుడు అర్షిద్ అనుమానాస్పదంగా మరణించాడు. పసి బాలుడి శరీరంపై 51 గాయాలున్నట్లు పోస్ట్‌మార్టంలో నిర్ధారించారు. బాలుడి జననాంగాలకు గాయాలు, సిగరెట్ కాల్చిన గాయాలు, అంతర్గత రక్తస్రావం, గతంలో ఎముకలు విరిగిన గాయాలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో తల్లి అఖిల, ప్రియుడు అష్కర్ కలిసి ఆ పసి బాలుడ్ని చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తాతల కుటుంబాలు అనుమానించాయి. ఆ పసి బాబుకు గతంలో రెండు చేతులు విరిగాయని గుర్తు చేశారు. బాలుడు కిందపడటంతో చేతులు విరిగాయన్న తల్లి అఖిల వాదనపైనా అనుమానం వ్యక్తం చేశారు.
బాలుడ్ని చిత్రహింసలకు గురి చేసి చంపడంపై అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాలుడి తల్లి అఖిల, ప్రియుడు అష్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధారాల కోసం అష్కర్‌ను అతడి ఇంటికి తీసుకెళ్లగా స్థానికులు దాడికి ప్రయత్నించారు.
మరోవైపు అష్కర్ తన భార్య అమీనాకు విడాకులు ఇవ్వకుండాలనే అఖిలతో కలిసి సహజీవనం చేస్తున్నాడని అత్త తెలిపింది. తన కుమార్తెను కూడా అతడు చిత్రహింసలకు గురి చేశాడని మీడియాతో అన్నది. అమీనాపై పదేపదే దాడి చేశాడని, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీయడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. దాడి కారణంగా అమీనా ఏడాది పాటు మంచానికే పరిమితమై అపస్మారక స్థితిలో ఉన్నదని అత్త తెలిపింది. తన కుమార్తెకు ఇటీవలే జ్ఞాపకశక్తి తిరిగి వస్తున్నదని, ప్రస్తుతం ఆమె ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించింది.
SHOCKING! 1.5-yr-old Arshid tortured to death in Nedumangad, Keralam (May 29).
Autopsy: 51 injuries — genital wounds, cigarette burns, internal bleeding, old fractures.
Mother Akhila & partner Ashkar arrested for abuse.
Grandparents had raised alarms & sought custody earlier. pic.twitter.com/Dhzq5ZyfpI
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 1, 2026