తిరువనంతపురం : మాయమాటలు చెప్పి 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ ట్యూషన్ టీచర్‌కు ఇక్కడి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం 111 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాదిపాటు జైలు శిక్షను అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
2019 జూలై 2న ట్యూషన్ టీచర్ మనోజ్(44) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని క్షమించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికపై తన భర్త అత్యాచారానికి పాల్పడినట్టు తెలుసుకుని మనోజ్ భార్య గతంలోనే ఆత్మహత్య చేసుకుంది. మనోజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడడమేగాకుండా ఆ దారుణాన్ని తన మొబైల్లో చిత్రీకరించాడు.