Covid in Kerala: కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. ఒక్కరోజే 595 మంది మృతి
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది
తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 62,11,116కు చేరింది. అయితే గురువారం నాటి కేసులతో పోల్చితే ఇవాళ్టి కేసులు కొంచెం తక్కువే. గురువారం 42,677 మందికి కరోనా సోకింది.
ఇదిలావుంటే, కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 595 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 57,296కు పెరిగింది. ఇక కొత్తగా 41,037 మంది కరోనా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 57,86,949కి చేరింది. రాజధాని తిరువనంతపురం సహా మొత్తం 14 జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Corona deaths
- Covid 19
- Kerala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

