తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఇవాళ కొత్తగా 19,675 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ 100కు తగ్గకుండా నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 142 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,039కి చేరింది.
ఇదిలావుంటే ఇవాళ కరోనా బారినుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఇంచుమించు అదేస్థాయిలో ఉన్నది. కొత్తగా 19,702 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 43,73,966కు పెరిగింది. ఇక కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం 1,61,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 14 రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళంలో అత్యధికంగా 2,792 మందికి పాజిటివ్ వచ్చింది.