Nipah Virus | నిఫా వైరస్ వ్యాప్తితో కేరళలో అలర్ట్.. లక్షణాలు, చికిత్స?
Nipah Virus | కేరళ (Kerala)లో ప్రమాదకర నిఫా వైరస్ (Nipah Virus) తిరిగి ఆందోళన కలిగిస్తున్నది.
Nipah Virus | కేరళ (Kerala)లో ప్రమాదకర నిఫా వైరస్ (Nipah Virus) తిరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి సోకి ఒక టీనేజర్ ఈ నెల 1న కోజీకోడ్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో మరణించగా, మలప్పురానికి చెందిన 18 ఏండ్ల యువతి, పాలక్కాడ్‌కు చెందిన 39 ఏండ్ల మహిళకు ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వైరస్ బయపడిన కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. దాదాపు 400 మందికిపైగా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించింది. వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. కాంటాక్ట్ ట్రేసింగ్, రోగ లక్షణాల గుర్తింపుతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రాంతంలో 26 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఎలా వ్యాపిస్తుంది..
దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు, చికిత్స?
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Also Read..
Hidden Camera | రహస్య కెమెరాతో.. అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన భక్తుడు
Bees | విచిత్ర ఘటన.. తేనెటీగల కారణంగా గంట ఆలస్యమైన ఇండిగో విమానం
Patna businessman | వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య కేసు.. ఎన్కౌంటర్లో కీలక నిందితుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

