Kerala Nurse | న్యూఢిల్లీ, జనవరి 2: హత్య ఆరోపణలతో యెమెన్ దేశంలో మరణ శిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియకు తాము సహాయం చేస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆమెకు శిక్ష పడ్డ ప్రాంతం హౌతీల ఆవల పరిధిలో ఉందని, అయినప్పటికీ ఆమె విడుదలకు తాము చేయగలిగినంత సహాయం చేస్తామని. కఠిన చర్యలకు వెనుకాడమని ఇరాన్ హామీ ఇచ్చింది.
కాగా, ఇప్పటికే ఆమెను విడిపించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ అందజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 37 ఏండ్ల నిమిష ప్రియ యెమెన్ వాసి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన ఆరోపణలపై 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్నది. 2018లో ఆమెకు మరణశిక్ష విధించగా, తాజాగా యెమెన్ అధ్యక్షుడు దానిని ఆమోదించారు. ఆమెకు బాధిత కుటుంబం నుంచి క్షమాపణ కనుక లభించకపోతే నెల రోజుల్లో మరణ శిక్ష అమలవుతుంది.