తిరువనంతపురం: ఉక్రెయిన్ సైనిక బలగాలు జరిపిన దాడుల్లో కేరళ యువకుడు రష్యాలో మరణించాడు. రష్యా మిలటరీ తరఫున పనిచేస్తున్న త్రిస్సూర్‌కు చెందిన సందీప్ (36), ఉక్రెయిన్ యుద్ధంలో మరణించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశాల్లోని మలయాళీ సంఘాల నుంచి సందీప్ కుటుంబానికి ఈ మేరకు సమాచారం అందింది.
రెస్టారెంట్లో ఉద్యోగం లభించిందని సందీప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మాస్కోకు చేరుకోగా, బలవంతంగా అతడ్ని ఆ దేశ మిలటరీలో చేర్చారని స్థానికులు చెబుతున్నారు. రష్యాలో ఉద్యోగాలంటూ ఏజెంట్లు చేస్తున్న మోసాలకు కేరళ సహా వివిధ రాష్ర్టాలకు చెందిన యువకులు బలవుతున్నారు.