తిరువనంతపురం: కేరళ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన అయిదు రోజుల జీతాన్ని విరాళంగా(Salary Collection) స్వీకరించనున్నది. అయితే ముఖ్యమంత్రి సహాయనిధికి ఆ మొత్తం వెళ్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి.. ఊళ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ విలయంలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ భారీ ఆస్థి నష్టం జరిగింది. అయితే వయనాడ్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. దాని కోసం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 5 రోజుల జీతాన్ని సేకరిస్తున్నారు.
ఒకవేళ ఎక్కువ ఇవ్వాలనుకున్న ఉద్యోగులు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. 5 రోజుల జీతాన్ని విరాళంగా ఇవ్వడానికి సముఖంగా ఉన్నట్లు ఉద్యోగుల నుంచి అంగీకార లేఖను తీసుకోనున్నారు. మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆ అమౌంట్ను విత్డ్రా చేస్తారు. ఒకవేళ ఎక్కువ ఇవ్వాలనుకుంటే, 10 ఇన్స్టాల్మెంట్లలో జీతాన్ని కట్ చేస్తారు.